బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (20:00 IST)

ఏ ఆలోచన లేని వెధవలు అలా మాట్లాడతారు: భట్టి విక్రమార్క

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీ టీమ్ అంటూ తమను పేర్కొనడాన్ని తప్పుబట్టారు. సీఎంను కలవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారి పట్ల సీరియస్ అయ్యారు. తన దృష్టిలో వారసలు మనుషులే కారన్నారు.

దళిత మహిళ లాకప్ డెత్ జరిగితే సీఎంను కలవడం తప్పా? అని ప్రశ్నించారు. దీనిపై తప్పుడు ప్రచారం చేసేవాడు అసలు మనిషే కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళ మరణించినా కొందరు వెధవలు మాట్లాడటం లేదన్నారు. అసలు దళితులకు బ్రతికే హక్కు లేదా అన్నారు.

నియోజకవర్గానికి చెందిన మహిళ మరణిస్తే.. మీలా దున్నపోతులా మాట్లాడకుండా ఉండలేనంటూ రఘునందన్ రావును ఉద్దేశించి అన్నారు. రఘునందన్‌రావును గెలిపించుకోవడం దుబ్బాక ప్రజల దౌర్భాగ్యమని భట్టి వ్యాఖ్యానించారు.

‘‘ఆయన నియోజకవర్గంలో ఇలాగే జరిగితే ఇంట్లో నిద్రపోతారా... ఏ ఆలోచన లేని వెధవలు అలా మాట్లాడతారు. నేను అలా ఉండలేను’’ అంటూ మండిపడ్డారు.