శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (06:45 IST)

చిన్నారుల ప్రాణాలు తీసే 'బ్లూ వేల్‌ ఛాలెంజ్'... సుప్రీం ఏమంటోంది?

చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్న 'బ్లూ వేల్‌ ఛాలెంజ్‌'పై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్న 'బ్లూ వేల్‌ ఛాలెంజ్‌'పై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. బ్లూవేల్‌ లింకులకు సంబంధించి ఆయా సంస్థలకు తక్షణ ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది గుర్మీత్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. 
 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ కూడిన ధర్మాసనం దీనిపై కేంద్రానికి, అటు ఢిల్లీ పోలీసులకు సైతం ఏయే చర్యలు చేపట్టారో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది. చిన్నారుల ప్రాణాలను తీస్తున్న 'బ్లూవేల్‌ ఛాలెంజ్‌' గేమ్‌కు సంబంధించిన లింకులు తొలగించాలని ఆయా సంస్థలకు ఇటీవల కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఏవేం చర్యలు తీసుకున్నారో తెలుపుతూ నివేదిక సమర్పించాలని ఆయా సంస్థలకు హైకోర్టు సూచించింది. ఈ నెల 28లోగా తమ స్పందన తెలపాలని పేర్కొంది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది.