సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (20:28 IST)

సివిల్ సర్వీసులు 2020 తుది ఫలితాలు-విడుదల

దేశంలో అత్యున్నత సర్వీసులు యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు వచ్చేశాయ్. సివిల్ సర్వీసులు 2020 తుది ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. మొత్తంగా 761 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. యూపీఎస్సీ సివిల్స్ 2020 తుది ఫలితాలలో శుభమ్ కుమార్‌కు టాప్ ర్యాంక్ లభించింది. 
 
ఐఐటీ బాంబే నుంచి ఆయన సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాలలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. జాగ్రతి అవస్తికి ఓవరాల్‌గా రెండో ర్యాంక్ కాగా, మహిళలలో ఆల్ ఇండియాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆమె మనిత్ భోపాల్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు.