మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (13:34 IST)

కట్టుకున్న భార్యను తొలి రాత్రే తాంత్రికుడు, సోదరుడికి పంచిపెట్టిన భర్త.. ఎందుకు?

మూఢనమ్మకాల కారణంగా మహిళల జీవితాలు మంటగలిసిపోతున్నాయి. కొత్తగా వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయిపై అఘాయిత్యం జరిగినా మిన్నకుండిపోయాడు. కారణం అతను చనిపోకుండా వుండాలంటే.. తన భార్యపై తన సోదరుడ

మూఢనమ్మకాల కారణంగా మహిళల జీవితాలు మంటగలిసిపోతున్నాయి. కొత్తగా వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయిపై అఘాయిత్యం జరిగినా మిన్నకుండిపోయాడు. కారణం అతను చనిపోకుండా వుండాలంటే.. తన భార్యపై తన సోదరుడిని అత్యాచారం చేయించాడు. అంతేగాకుండా తాంత్రికుడు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హపూర్ జిల్లాలోని పిలఖ్వా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. లిసారీ గేట్ ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలికి ఈ నెల 15వ తేదీన టెక్స్‌టైల్ వ్యాపారితో వివాహం జరిగింది. వివాహమైన తొలి రాత్రిలో వధువు వున్న గదిలోకి తాంత్రికుడు, ఆమె భర్త, బావ ప్రవేశించారు. పాలలో ఏదో కలిపి ఇవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై తాంత్రికుడు, ఆమె బావ అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తనకు ప్రాణ గండం వుందని.. అది తొలగిపోవాలంటే.. కట్టుకున్న భార్యను వేరు ఇరువురికి పంచి పెట్టాలని తాంత్రికుడి ఇచ్చిన సలహా మేరకు బాధితురాలి భర్త ఈ పని చేశాడని పోలీసులు తెలిపారు. పెళ్లైన వారం పాటు ఈ అఘాయిత్యం జరగడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న మీరట్ పోలీసులు తాంత్రికుడు, భర్త,  బావలను అదుపులోకి తీసుకున్నారు.