సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జూన్ 2023 (10:47 IST)

19 ఏళ్ల యువతిపై పదునైన ఆయుధంతో దాడి.. వీడియో వైరల్

crime scene
మహారాష్ట్రలోని పూణెలో 19 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని దుండగుడు పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. ఈ తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన మహిళను అత్యవసర వైద్య చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన దుండగుడి పోలీసులు గుర్తించారు.