ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (12:29 IST)

ఎల్టీటీఈపై నిషేధం... జైషే మొహ్మద్ ఉగ్రవాది అరెస్టు

ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన ఎల్టీటీఈపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిజానికి ఈ నిషేధం అమల్లో ఉంది. ఈ నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ నిషేధం ఐదేళ్ళ పాటు కొనసాగుతుందని అందులో పేర్కొంది. కాగా, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఎల్టీటీఈపై కేంద్రం తొలిసారి నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, జైష్ మొహ్మద్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసుల గాలింపు చర్యల్లో ఈ ఉగ్రవాదిని శ్రీనగర్‌లో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాది పేరు అబ్దుల్ మాజిద్ బాబా. ఇతనిపై గతంలో రూ.2 లక్షల రివార్డు ఉంది. గత 2007లో ఢిల్లీలో జరిగిన ఘటనలత మాజిద్‌కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.