1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 మే 2025 (11:08 IST)

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Chardham Yatra
Chardham Yatra
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను పేర్కొంటూ భారత ప్రభుత్వం చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాత్రికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉదయం విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది.
 
ఈ యాత్రకు పాకిస్తాన్ దాడుల ముప్పు ఉందని ప్రభుత్వం పేర్కొంది. దీని ఫలితంగా నాలుగు కీలక పుణ్యక్షేత్రాలు -గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ - భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్రను తక్షణమే నిలిపివేసినప్పటికీ, సస్పెన్షన్ వ్యవధి, తిరిగి ప్రారంభించే తేదీని త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
 
ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమైంది. యమునోత్రి, గంగోత్రిలోని ఆలయాలు ఏప్రిల్ 30న ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మే 2న కేదార్‌నాథ్, మే 4న బద్రీనాథ్ తెరవబడ్డాయి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న యాత్రికులకు యాత్రలో పాల్గొనడానికి అనుమతి ఉంది.
 
 అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడే చార్‌ధామ్ యాత్ర సాంప్రదాయకంగా హిమాలయాలలోని యమునోత్రి వద్ద ప్రారంభమై, గంగోత్రి, కేదార్‌నాథ్ గుండా సాగి, బద్రీనాథ్‌లో ముగుస్తుంది.