ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (19:02 IST)

చెంగల్పట్టులో మహిళా బాబా.. నెట్టింట వైరల్.. ఈ ముఖం ఎక్కడో చూసినట్లుందే!?

baba
తమిళనాడులో చెంగల్‌పట్టులో కృప దేవతగా చెప్పుకుంటున్న మహిళ గురించి నెటిజన్ల సమాచారం వైరల్‌గా మారింది. చెంగల్పట్టు, దాని పరిసర ప్రాంతాల్లో ఆదిపరాశక్తి అవతారమైన అన్నపూర్ణి అమ్మన్‌గా మహిళా బోధకురాలి పోస్టర్లు అతికించారు. ఓ హాలులో మహిళ కొందరిని ఆశీర్వదించిన వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ మహిళ ఎవరో గుర్తించారు. 
 
కుటుంబ సమస్యలపై ప్రైవేట్ టెలివిజన్‌లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్‌లో కుటుంబ సమస్యలపై చర్చించే మహిళగా ఆమె కనిపించింది. ఆ షో వీడియోను గుర్తించిన నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంలో, ఈ ఫోటోలు సోషల్ వెబ్‌సైట్లలో ఎక్కువగా షేర్ అవుతుండటంతో, చెంగల్పట్టు తాలూకా పోలీసులు సంబంధిత కళ్యాణ మండపం యజమానిని విచారిస్తున్నారు.