శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (10:41 IST)

మిమిక్రీ ఆర్టిస్ట్ ఎంత పనిచేశాడో తెలుసా? అమ్మాయిలా మాట్లాడి యువకులను?

మిమిక్రీ ఆర్టిస్ట్ కొంపముంచాడు. మిమిక్రీ రావడంతో దాన్ని ఆధారంగా చేసుకుని 350మందిని మోసం చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లా పణుకుడికి చెందిన వళ్లల్ రాజ్‌కుమార్ మిమిక్రీ ఆర్టిస్ట్. అమ్మాయిలా గొంతుమార్చి అబ్బాయిలకు ఫోన్ చేసి వలపు వల విసిరేవాడు. వారు తమ ట్రాప్‌లో పడ్డారని భావించిన తర్వాత వారి నుంచి డబ్బులు గుంజేవాడు. 
 
ఇలా ఏకంగా 350 మందిని మోసం చేశాడు. ఆ తర్వాత పారిపోయేవాడు. ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్ చేతిలో మోసపోయామని తెలిసిన బాధిత యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే అమ్మాయిలా గొంతు మార్చుతున్న రాజ్‌కుమార్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇంకా విచారణను వేగవంతం చేశారు.