1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (11:18 IST)

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

Rape
టీవీ ఛానల్ యాంకర్‌పై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రధాన అమ్మవారి ఆలయానికి చెందిన పూజారి తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూజరి పేరు కార్తీక్ మునిస్వామి. తనపై జరిగిన దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అత్యాచారానికి గురైన యాంకర్ చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో ఉంటుంది. తరచూ ఆలయానికి వెళ్లే తనకు ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో పరిచయం ఏర్పడిందని తెలిపింది. ఈ స్నేహంతో తాను గుడికి వచ్చినప్పుడల్లా గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడని చెప్పింది. 
 
ఈ క్రమంలో తమకు స్నేహం పెరిగిందని... ఒకరోజు తాను గుడికి వచ్చినప్పుడు తన బెంజ్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పాడని... కారులో ప్రయాణిస్తుండగా తీర్థం ఇచ్చాడని, దీన్ని తాగిన తర్వాత తనకు స్పృహ తప్పిందని ఆమె తెలిపింది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఇది జరిగిన తర్వాత తనను గుడిలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని వెల్లడించింది. 
 
కానీ ఆ తర్వాత చాలా సార్లు తమ ఇంటికి వచ్చాడని, తాను గర్భవతిని అయ్యానని తెలిపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడని, ఆ తర్వాత తనను వ్యభిచారం చేయమని బలవంతం చేశాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు.