శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (09:25 IST)

చెరువులో ఛత్తీస్‌గఢ్ నటి మృతదేహం...

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వర్ధమాన నటి ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె శవం చెరువు నీటిలో తేలింది. తన కుమార్తె మృతదేహాన్ని తల్లి గుర్తించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాయ్‌పూర్‌కు చెందిన అంచల్ యాదవ్ నటిగా, మోడల్‌గా రాణిస్తోంది. ఈమె గత సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బైక్‌పై ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడిందని, ఆ తర్వాత మళ్లీ ఆమెను చూడనేలేదని తల్లి వివరించారు. ఆంచల్ వంటిపై కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. 
 
గతంలో ఆంచల్‌కు ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవని, అప్పట్లో ఓ వీడియోతో అతడిని బ్లాక్ మెయిల్ చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు ఆంచల్ బీమా ఏజెంట్‌గా కూడా పని చేసింది.
 
ఈ నేపథ్యంలో ఆమె ఓ చెరువులో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో, వారు నటి మృతదేహాన్ని వెలికి తీశారు. మొదట ఆమె ఎవరో గుర్తించలేకపోయారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా సోషల్ మీడియాలో ప్రకటన ఇవ్వడంతో ఆంచల్ తల్లి వెంటనే స్పందించి అది తన కుమార్తె శవమేనని చెప్పింది. దుండగులు ఆంచల్‌ను దారుణంగా హతమార్చి ఆపై శవానికి పెద్ద రాయి కట్టి నీటిలో వదిలేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.