ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (19:20 IST)

వాషింగ్‌మెషీన్‌లో నాగుపాము.. షాకైన వ్యక్తి.. ఆపై ఏం జరిగిందంటే? (Video)

Cobra
Cobra
సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రాజస్థాన్ కోటాలో ఓ నాగుపామును వాషింగ్‌మెషీన్‌లో గుర్తించారు. ఐదు అడుగుల పొడవైన నాగుపామును వాషింగ్ మెషీన్‌లో చూసిన వారంతా షాకయ్యారు.  
 
కుటుంబ సభ్యులు ఈ ఘటనను కెమెరాలో బంధించి తమ ఇంట్లో నాగుపాము కనిపించడంతో అప్రమత్తమయ్యారు. సరీసృపాన్ని చివరికి రక్షించి అడవిలోకి విడుదల చేశారు.  
 
వాషింగ్ మెషీన్‌లో దాక్కున్న పాము బుసలు కొట్టడం, నాలుకను ముందుకు వెనుకకు లాగడం వీడియో ఫుటేజీలో రికార్డయింది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. 
 
కుటుంబ సభ్యుల్లో ఒకరు బట్టలు ఉతకడానికి మెషిన్‌లో వేయబోతుండగా నాగుపాము కనిపించింది. శంభుదయాళ్‌గా గుర్తించిన ఆ వ్యక్తి వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు ఉతకడానికి వెళ్లినప్పుడు ఊహించని దృశ్యం చూసి షాక్ అయ్యాడు.