శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (11:56 IST)

సీమాన్‌ను అరెస్ట్ చేస్తారా లేదా? ఆరు గంటలు విజయలక్ష్మి అక్కడే?

Vijayalakshmi
Vijayalakshmi
నామ్ తమిళర్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని నటి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉంది. సీమాన్‌పై సోషల్ మీడియా ద్వారా నిరంతరం ఆరోపణలు చేస్తోంది. తాజాగా విజయలక్ష్మి తమిళ ప్రగతిశీల కూటమి అధినేత్రి వీరలక్ష్మితో కలిసి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి సీమాన్‌పై నాలుగు పేజీల ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం చెన్నైలోని రామాపురం పోలీస్ స్టేషన్‌లో నటి విజయలక్ష్మిని పోలీసులు విచారిస్తున్నారు.
 
సీమాన్‌పై విజయలక్ష్మి ఫిర్యాదుపై డిప్యూటీ కమిషనర్ ఉమైల్ ఆరు గంటలకు పైగా విచారణ చేపట్టారు. నటి విజయలక్ష్మి పోలీస్ స్టేషన్ నుండి బయటకు రావడానికి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇంకా సీమాన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.