గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2023 (16:04 IST)

నన్ను చంపేస్తారని సమాచారం వుంది, నన్ను కాపాడండి: డిజిపికి పోసాని ఫిర్యాదు

posani krishnamurali
తనను చంపేస్తారనే సమాచారం తన వద్ద వున్నదనీ, తనను కాపాడాలంటూ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ఫిలిమ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఫిర్యాదు చేసారు. తెదేపా నాయకుడు నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని వున్నదంటూ పోసాని కంప్లైంట్ ఇచ్చారు. 
 
ఎవరైనా హత్య చేసేవారు చెప్పి చేస్తారా... అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు పోసాని. తనను తెదేపాలో చేరాలంటూ నారా లోకేష్ పీఎ ఒత్తిడి చేసారంటూ ఆరోపణలు చేసారు. వారు చెప్పిన మాట విననందుకే తనను అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
 
నారా లోకేష్ మాటకు ముందు బట్టలూడదీసి కొట్టిస్తామంటూ కేకలు వేస్తున్నారనీ, ఎంతమంది బట్టలు ఊడదీసి కొడతారంటూ ప్రశ్నించారు పోసాని. ప్రజలకు ఏమి చేస్తారో చెబితే బాగుంటుందని, అంతేగానీ బట్టలు ఊడదీసి కొడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరంటూ చెప్పుకొచ్చారు.