ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (23:06 IST)

కన్యాకుమారిలో వివేకానంద విగ్రహం.. గాజు వంతెన.. సముద్రపు అలలను...?

Kanyakumari
Kanyakumari
కన్యాకుమారిలోని వివేకానంద, తిరువళ్లువర్‌ విగ్రహాల మధ్య గాజు వంతెన నిర్మిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఉన్న కన్యాకుమారిని భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుండి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. 
 
ఈ నేపథ్యంలో వివేకానంద స్మారక మందిరం, తిరువల్లువర్ విగ్రహం మధ్య గ్లాస్ కేజ్ బ్రిడ్జి నిర్మిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించి ఇందుకోసం 37 కోట్లు కేటాయించింది. 
 
చెన్నైకి చెందిన ఓ ప్రముఖ సంస్థ ఇందుకోసం టెండర్ తీసుకున్నదని, ఈ గ్లాస్ కేజ్ బ్రిడ్జి పొడవు 97 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం తెలియజేసింది. ఇతర దేశాల్లో మాదిరిగానే ఈ వంతెన గుండా వెళుతూ సముద్రపు అలలను పర్యాటకులు ఆస్వాదించవచ్చునని చెబుతున్నారు.