శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:06 IST)

లాక్ డౌన్ విధించినా భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు దేశాల్లో కరోనా వైరస్ వల్ల లక్షా 32 వేల మందికి పైగా మృతి చెందారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో 25 మంది కరోనాతో మృతి చెందారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
వాణిజ్య ప్రాతిపదికన 55 దేశాలకు మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌తో పోరాడటానికి జర్మనీ, యుఎస్, యుకె, మలేషియా, జపాన్, ఫ్రాన్స్ నుండి వైద్య పరికరాలను సేకరించే దిశగా భారత్ చూస్తోంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.