శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (19:34 IST)

భారత్‌కు చైనా మెడికల్ కిట్లు.. వాడేసినవా? నాసికరకమా?

కరోనా కష్టకాలంలో అనేక ప్రపంచ దేశాలకు భారతదేశం ఔషధాల రూపంలో సహాయం చేస్తూ పెద్దన్న పాత్రను పోషిస్తోంది. ఇపుడు భారత్‌కు చైనా సహాయం చేస్తోంది. భారత్‌కు అవసరమైన (వ్యక్తిగత సంరక్షణ పరికరాలు) మెడికల్ కిట్లను చైనా ఎగుమతి చేస్తోంది. 
 
అయితే, చైనా పంపిస్తున్న పీపీఈ కిట్ల నాణ్యతపైనే ఇపుడు పలువురుకి అనేక రకాలైన సందేహాలు వస్తున్నాయి. చైనా కిట్లు, మాస్కులపై ఇప్పటికే ఇటలీ, అమెరికా, స్పెయిన్ దేశాలు ఫిర్యాదు చేశాయి. 
 
మరోవైపు భారత్‌కు చైనా పంపిన సామగ్రిలో కూడా డొల్లతనం బయటపడింది. ఇండియాకు పంపిన కిట్లలో దాదాపు 30 శాతం కిట్లలో నాణ్యత లేదని, మరికొన్ని వాడేసినట్టుగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. 
 
కాగా, ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పీపీఈ కిట్లకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. పలు దేశాలు విదేశాల నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నాయి. వీటిని తయారు చేసి, ఎగుమతి చేస్తున్న దేశాలలో చైనానే ముందు వరుసలో ఉండటం గమనార్హం.