శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (09:55 IST)

ఢిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా లక్షణాలు?

కరోనా లక్షణాలతో బాధ పడుతున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ రాజీవ్‌గాంధీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో సోమవారం జరిగిన అఖిల పక్ష సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పాటు సత్యేంద్రజైన్‌ కూడా హాజరయ్యారు.

ఆయనకు కరోనా పరీక్షలు చేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అధిక జ్వరం, శ్వాససమస్యతో నిన్న రాత్రి తాను ఆర్‌జిఎస్‌ఎస్‌హెచ్‌ ఆస్పత్రిలో చేరానని మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, గతవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చిన సంగతి తెలిసిందే. 42వేల కరోనా కేసులతో ఢిల్లీ భారత్‌లో మూడోస్థానంలో ఉంది.
 
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కలకలం..
తెలంగాణ కరోనా నిపుణుల కమిటీ సభ్యుడు డా. గంగాధర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. కాగా, ఆయన గత రెండు రోజులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటలతో వరుసగా సమావేశాలకు హాజరయ్యారు. 

తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డిలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.