ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (18:11 IST)

ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో మ్యాటర్‌హార్న్‌ శిఖరంపై మువ్వన్నెల జెండా.. ఎలా?

Flag colours
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారత పోరాటానికి స్విట్జర్లాండ్‌ వినూత్నంగా సంఘీభావం ప్రకటించింది. దేశంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో.. మ్యాటర్‌హార్న్‌ శిఖరంపై మువ్వన్నెల జెండాను ప్రదర్శించింది. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో భారతీయులకు గెలిచే విశ్వాసం, సామర్థ్యం కలగాలని కోరుకుంటూ ట్వీట్ చేసింది. 
 
ప్రపంచం దేశాల్లో ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని.. ఇప్పుడు అంత పెద్ద దేశం.. కరోనా మహమ్మారితో పోరాడుతోందని.. ఇది భారత్‌కు పెద్ద సవాల్‌ అని పేర్కొంటూ.. ఈ పోరాటంతో.. భారతీయులు విజయం సాధించాలని.. అందుకు వారికి విశ్వాసం, సామర్థ్యం చేకూరాలని.. సంఘీభావం తెలిపేందుకే ఈ మ్యాటర్‌ హార్న్‌పై భారత జెండా ప్రదర్శిస్తున్నామంటూ జెర్మాట్‌ మ్యాటర్ హార్న్‌ పర్యాటక సంస్థ ఫేస్‌బుక్‌లో పెట్టింది. 
 
స్విట్జర్లాండ్‌కు చెందిన విద్యుద్దీపాల కళాకారుడు.. గెరీ హాఫ్‌సెట్టర్‌.. స్విట్జర్లాండ్‌, ఇటలీ దేశాల మధ్య ఉన్న ఈ ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో.. దాదాపు 4,478 మీటర్ల ఎత్తున్నశిఖరంపై లేజర్‌ లైట్లతో పలు దేశాల జెండాలను ప్రదర్శించారు. ప్రపంచ దేశాలన్నీ ఈ కంటికి కనిపించని కరోనా మహమ్మారితో చేస్తున్న పోరాటంలో గెలవాలని.. ఈ లైటింగ్‌ సిరీస్‌ను స్టార్ట్‌ చేశారు. చిమ్మని చీకట్లో మిణుకు మిణుకు చుక్కల్లో ఆ పెద్ద పర్వతంపై.. మిళమిళ మెరిసిన మన మువ్వన్నెల జెండా చూపరులను ఆకట్టుకుంటోంది.