ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 8 డిశెంబరు 2020 (19:49 IST)

తండ్రి ఫోనులో ఇతర మహిళల ఫోటోలు, అభ్యంతరకర రీతిలో చూసి కుమార్తె షాక్

తన ఫోన్లో డేటా అయిపోయింది. తండ్రి ఫోన్ తీసుకుని ఆన్లైన్ క్లాస్ చూసింది. ఆ తరువాత తండ్రి మొబైల్లో వీడియోలు ఎక్కువగా ఉంటే చూద్దామనుకుని చేతికి తీసుకుంది. అంతే ఆ వీడియోలు చూసి షాకయ్యింది. తన తండ్రి వేరొక మహిళతో అసభ్యకరమైన రీతిలో ఉండటాన్ని చూసి ఆవేదనకు గురై తల్లికి విషయాన్ని చెప్పింది.
 
కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగళ తాలూకాకు చెందిన కుమార్ అనే వ్యక్తి కుమార్తె ఆన్లైన్లో ఇంటర్ క్లాసులను చూస్తోంది. తన ఫోన్లో డేటా అయిపోవడంతో నిన్న మధ్యాహ్నం తండ్రి మొబైల్‌ను తీసుకుంది. గంటన్నరపాటు ఆన్లైన్ క్లాస్ జరిగింది.
 
ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ తండ్రి ఫోను చూడని ఆమె గ్యాలరీ మొత్తాన్ని చూసింది. అందులో కొంతమంది మహిళలతో తండ్రి క్లోజ్ ఉన్న వీడియోలు చూసి నివ్వెరపోయింది. చాలామంది మహిళలు అందులో ఉండటంతో వెంటనే ఆ వీడియోలను తల్లికి చూపించింది. ఒక్కసారిగా ఇంట్లో గొడవలు మొదలై... చివరకు విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్ళింది.