మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మే 2021 (13:44 IST)

మరో వారం రోజుల్లో లాక్డౌన్ తొలగిస్తాం : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయని, ఇదే పరిస్థితి కొనసాగితే మరో వారం రోజుల్లో లాక్డౌన్ ఎత్తివేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. 
 
ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ, నెల రోజుల్లోనే 29 వేల నుంచి 2 వేల లోపుకు దిగొచ్చాయి. కేసులు పెరిగిపోతుండడంతో వెంటనే లాక్డౌన్ విధించడం వల్ల మంచి ఫలితం వచ్చిందని తెలిపారు. 
 
ఢిల్లీలో కొత్తగా కేవలం 1,600 కేసులే నమోదయ్యాయని ప్రకటించారు. పాజిటివిటీ రేటు 2.5 శాతం కన్నా తక్కువే నమోదైందన్నారు. కేసులు భారీగా తగ్గుతున్నాయని, ఇంకో వారం రోజుల్లో లాక్డౌన్‌ను క్రమంగా ఎత్తేస్తామని చెప్పారు. 
 
ప్రస్తుతం మరో వారం పాటు లాక్డౌన్‌ను పొడిగిస్తున్నామని, అందరి ఏకాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 31 తర్వాత లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తామని స్పష్టం చేశారు.
 
కరోనాతో పోరు ఇంకా అయిపోలేదని కేజ్రీవాల్ చెప్పారు. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పారు. త్వరలోనే రూ.2 కోట్ల మందికి టీకాల కోసం చర్యలు చేపడతామన్నారు. దాని కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ వివరించారు.