శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (11:15 IST)

ఏడేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారు.. నాలుకను కోసేంత..?

ఢిల్లీలో ఏడేళ్ల బాలిక చిత్రహింసలకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రేణుకుమారి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు 50 ఏళ్లు. 
 
ఆమె తన 7 ఏళ్ల కుమార్తెను పెంచుతుండగా, ఆమెను దత్తత తీసుకున్న రోజు నుండి, ఆమెను చిత్రహింసవకు గురిచేసింది. శరీరంపై గాయపరిచింది. 
 
బాలిక నాలుక కోసేంతగా వాత పెట్టి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ స్థితిలో పాఠశాలకు వెళ్లి ఇంట్లో తనను చిత్రహింసలకు గురిచేసినట్లు ఉపాధ్యాయుడికి గాయాలను చూపించింది.
 
దీంతో ఉపాధ్యాయురాలు పోలీసులకు సమాచారం అందించగా, బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేణుక, ఆమె భర్త, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.