శుక్రవారం, 11 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (16:51 IST)

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

Sri Vishnu, Ketika Sharma, Ivana
Sri Vishnu, Ketika Sharma, Ivana
శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్- శిల్పి ఎవరో రిలీజ్ చేయడంతో మ్యూజిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు.
 
విశాల్ చంద్ర శేఖర్ సంగీత దర్శకుడిగా తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేసే ఒక సోల్ ఫుల్ రొమాంటిక్ మెలోడీని కంపోజ్ చేశారు.  శ్రీమణి రాసిన సాహిత్యం, హీరో శ్రీ విష్ణు తన జీవితంలోని ఇద్దరు స్పెషల్ అమ్మాయిలు కేతిక శర్మ, ఇవానా అందం పట్ల ప్రశంసలను కురిపిస్తూ పాట ఆకర్షణను పెంచుతుంది.
 
యాజిన్ నిజార్ సోల్ ఫుల్ వోకల్స్ తో సాంగ్ ని అద్భుతంగా అలపించారు. బ్యూటీఫుల్ విజువల్స్ తో కూడిన ఈ సాంగ్ లో శ్రీ విష్ణు క్యారెక్టర్ చార్మ్ అద్భుతంగా వుంది.  
 
శిల్పి ఎవరో యువతకు ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతోంది. మోడరన్ వైబ్,  థీమ్ యూత్ ని మెస్మరైజ్ చేశాలా వున్నాయి.  
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్ వేల్ రాజ్, ఎడిటింగ్ ప్రవీణ్ కెఎల్. ఆర్ట్ డైరెక్టర్ చంద్రిక గొర్రెపాటి.
 
#సింగిల్ మూవీ మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.