శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (11:36 IST)

ప్రియుడితో ఉల్లాసం.. ఇంతలో భర్త వచ్చేశాడు.. కోపంతో ఆ మహిళ ఏం చేసిందంటే?

ప్రియుడితో ఏకాంతంగా ఉల్లాసంగా ఉన్న సమయంలో భర్త వచ్చేశాడన్న కోపంతో.. భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్

ప్రియుడితో ఏకాంతంగా ఉల్లాసంగా ఉన్న సమయంలో భర్త వచ్చేశాడన్న కోపంతో.. భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్ జిల్లా, నీలకోట్టై ప్రాంతానికి చెందిన రవిచంద్రన్ భార్య సెల్వికి, విలాంపట్టికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం వుంది. గత రెండు రోజులుగా సెల్పి తన ఇంట్లోనే ప్రియుడితో ఉల్లాసంగా గడుపుతూ వచ్చింది.
 
ఇంతలో సెల్వి భర్త రవిచంద్రన్ ఇంటికొచ్చేశాడు. సెల్వి వేరొక వ్యక్తితో ఉల్లాసంగా ఉండటం చూసిన రవిచంద్రన్ షాక్ అయ్యాడు. ప్రియుడితో ఉండటాన్ని భర్త చూశాడన్న కోపంతో ప్రియుడితో కలిసి రవిచంద్రన్‌పై దాడికి పాల్పడింది. ఈ ఘటనపై రవిచంద్రన్ తన భార్య, ఆమె ప్రియుడిపై నిలకోట్టై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.