శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (17:34 IST)

కణితి తీయబోయి పుర్రెను పగులగొట్టిన వైద్యులు ... ఎక్కడ?

కొంతమంది వైద్యులు తమ విధుల్లో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి చర్యల వల్ల కొన్ని సమయాల్లో ప్రాణాలు పోతుంటాయి. మరికొందరు వికలాంగులుగా మారుతుంటారు. తాజాగా ఓ వ్యక్తికి మెడలో వచ్చిన కణితిని తీయబోయి.. పుర్రెను పగులగొట్టారు. దీంతో ఆ వ్యక్తి తలకు ఒకవైపు పుర్రె లేకుండా పోయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఉజ్జ‌యిని ప్రాంతానికి చెందిన కీర్తి పార్మ‌ర్ త‌ర‌చూ త‌ల తిరిగిన‌ట్లుగా, వాంతికి వ‌చ్చిన‌ట్లుగా అనిపించ‌డంతో ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రి వైద్యుల‌ను సంప్ర‌దించాడు.
 
దాంతో వాళ్లు స్కానింగ్ చేసి బాధితుడి మెద‌డులో క‌ణితి ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ క‌ణితిని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా తొల‌గించ‌క‌పోతే ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని హెచ్చరించారు. దాంతో 2019లో కీర్తి పార్మ‌ర్ బ్రెయిన్ ట్యూమ‌ర్‌ స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. 
 
వైద్యులు పార్మ‌ర్ పుర్రెలో కుడివైపు భాగాన్ని తెరిచి ట్యూమర్‌ను తొలగించారు. అయితే తెరిచిన పుర్రె భాగం ప‌గిలిపోవ‌డంతో తిరిగి సెట్ చేయ‌డం కుద‌ర‌లేదు. దాంతో ఆ పుర్రెను పూర్తిగా తొల‌గించి పుర్రెపైన ఉన్న చర్మాన్ని క‌లిపి కుట్టేశారు. 
 
ప్ర‌స్తుతం కీర్తి పార్మ‌ర్ కుడివైపు పుర్రె భాగం లేకుండానే దిన‌దిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న‌ట్లుగా కాలం వెల్ల‌దీస్తున్నాడు. కుడివైపు మెదుడు భాగంపై కేవ‌లం పైచ‌ర్మం మాత్ర‌మే అచ్చాద‌న‌గా ఉండ‌టంతో.. ఏ చిన్న దెబ్బ త‌గిలినా ప్రాణాలు పోతాయ‌న్న భ‌యంతో నిత్యం గ‌డ‌పాల్సి వ‌స్తున్న‌ది. కీర్తి పార్మ‌ర్ అవ‌స్థ చూడ‌లేక అత‌ని కుటుంబ‌స‌భ్యులు ఆవేద‌న చెందుతున్నారు. 
 
ఇదిలావుంటే క‌ణితి సైజు పెద్ద‌గా ఉన్నందున పుర్రె పగిలిపోతే సెట్ చేయ‌డం కుద‌ర‌ద‌ని స‌ర్జ‌రీకి ముందే తాము కుటుంబ‌స‌భ్యుల‌కు తెలిపామ‌ని వైద్యులు చెబుతున్నారు. ఎవ‌రి వ‌ర్ష‌న్ ఎలా ఉన్నా జ‌రిగిన‌దానికి బాధితుడు మాత్రం రెండేండ్లుగా క్ష‌ణ‌క్ష‌ణం భ‌యంతో బ‌తుకుతున్నాడు.