ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (15:25 IST)

ప్రత్యేక హోదా బిల్లు మనీ బిల్లు... ప్రొసీడింగ్స్ నుంచి తొలగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లును ద్రవ్య వినిమయ బిల్లు (మనీ బిల్లు)గా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లును ద్రవ్య వినిమయ బిల్లు (మనీ బిల్లు)గా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అందువల్ల ఈ బిల్లును తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టాలని సూచించారు. 
 
నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభలు గురువారం కూడా దద్ధరిల్లిపోయాయి. రాజ్య‌స‌భలో విప‌క్ష స‌భ్యులు త‌మ ప‌ట్టును వీడలేదు. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ఈ రోజు కూడా చ‌ర్చ చేప‌ట్ట‌ాల్సిందేనంటూ విప‌క్ష‌నేత‌లు ఛైర్మ‌న్‌ పోడియం వ‌ద్ద‌కు వెళ్లారు. అయితే, స‌భలో గందరగోళం మధ్యే స‌భ్యులు ప‌లు బిల్లులను ప్రవేశపెట్టారు. 
 
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ధారణ చేసినట్టు డిప్యూటీ ఛైర్మ‌న్ కురియ‌న్ ప్ర‌క‌టించారు. న్యాయ స‌ల‌హా తీసుకున్న త‌ర్వాతే కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుపై ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. 
 
ప్ర‌త్యేక‌హోదా బిల్లును ప్రొసీడింగ్స్ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం ప‌లు అంశాల‌పై ఇత‌ర స‌భ్యులు మాట్లాడుతుండ‌గా విప‌క్ష‌నేత‌లు పోడియం వ‌ద్ద త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తుండ‌డంతో రాజ్య‌స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు కురియ‌న్ పేర్కొన్నారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా సభను సోమవారానికి వాయిదా వేశారు.