అభ్యాస్ డ్రోన్ పరీక్ష విజయం
అభ్యాస్ హైస్పీడ్ ఎక్స్‌పాండబుల్ ఏరియల్ టార్గెట్ (హెచ్.ఈ.ఏ.టి) అనే డ్రోన్‌ను భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటర్మ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా నిర్వహించింది.
ఈ పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆటోపైలట్ వ్యవస్థ సాయంతో ముందుకు దూసుకెళుతుంది. ఇందులో చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంఈఎంఎస్ నేవిగేషన్ వ్యవస్థను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు వినియోగించారు. ఈ ప్రయోగంలో అభ్యాస్ నిర్దేశిత ప్రమాణాలన్నింటిని అందుకుందని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి.