శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (13:12 IST)

ఇంజనీరింగ్ విద్యార్థినిని రేప్ చేసి చెట్టుకు ఉరేశారు.. ఎక్కడ?

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిని అత్యాచారం చేసి.. ఆ తర్వాత చెట్టుకు ఉరివేశారు. ఈ దారుణం రాయచూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈనెల 16వ తేదీన రాయచూర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు అమ్మాయి మృతదేహం వేలాడుతున్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కిందకి దించి పరిశీలించగా, మృతురాలు మధు పథారాగా గుర్తించారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసినట్టు పోలీసులు గుర్తించారు.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మృతురాలు సివిల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. దుండగులు బాధితురాలికి చిత్రహింసలకు గురిచేసి.. ఆమెతో సూసైడ్‌ నోట్‌ రాయించి, ఆ తర్వాత చెట్టుకు ఉరివేసినట్టు సమాచారం. 
 
ఆమె రాసినట్టు చెప్తున్న సూసైడ్‌ నోట్‌లో చదువులో వెనుకబడటంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది. అయితే, ఆమె అన్ని సబ్జెక్టులను పాస్‌ అయిందని, చదువులో వెనుకబడిందనే మాట అవాస్తవని ఈ సూసైడ్‌ నోట్‌ను ఆమె స్నేహితులు, బంధువులు కొట్టిపారేస్తున్నారు. మధు ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె సజీవదహనం చేసి.. చెట్టుకు వేలాడదీశారని ఆమె తండ్రి నాగరాజ్‌ నేతాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.