బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (10:34 IST)

దినకరన్‌కు మద్దతు.. 46 మందిపై ఈపీఎస్ వేటు

ఆర్కే నగర్ ఎన్నికల్లో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్‌కు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే నేతలపై తమిళనాడు సీఎం పళనిసామి కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో ఏకంగా 46మందిపై ఈపీఎస్ వేటు వేశారు. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని

ఆర్కే నగర్ ఎన్నికల్లో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్‌కు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే నేతలపై తమిళనాడు సీఎం పళనిసామి కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో ఏకంగా 46మందిపై ఈపీఎస్ వేటు వేశారు. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.
 
వేటుపడిన వారిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వున్నారు. వీరంతా ధర్మపురి, మధురై, తిరుచిరాపల్లి, పెరంబులూరు, విల్లుపురం జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే నేతలు వున్నారు. ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ సీఎం జయలలితకు అందించిన చికిత్సకు సంబంధించిన ఆధారాలను అందజేయాలంటూ చిన్నమ్మకు సమన్లు వెళ్లాయి. 
 
ఈ నెల 22న ఈ-మెయిల్ ద్వారా జైలులో వున్న శశికళకు సమన్లు వచ్చాయని, జయ మరణంపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ ఈ సమన్లను జారీ చేసింది. సమన్లు వచ్చిన విషయాన్ని జైలు అధికారులు శశికళకు తెలిపారు. ఈమెయిల్ ద్వారా వచ్చిన సమన్లను తీసుకోవడానికి శశికళ నిరాకరించారు. కానీ ఈ-మెయిల్ ద్వారా చిన్నమ్మకు సమన్లు పంపలేదని కమిషన్ ప్రకటించింది.