బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (14:34 IST)

దినకరన్‌కు వత్తాసు పలికిన ఆరుగురు అవుట్.. ఓపీఎస్, ఈపీఎస్ సీరియస్

ఆర్కేనగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఆరుగురు అన్నాడీఎంకే నేతలను తొలగిస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. అన్నాడీఎంకేలో వారసత్వపు రాజ

ఆర్కేనగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఆరుగురు అన్నాడీఎంకే నేతలను తొలగిస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. అన్నాడీఎంకేలో వారసత్వపు రాజకీయాలకు తావుండదని... ఎంజీఆర్, అమ్మ బాటల్లోనే ఈ పార్టీ నడుస్తుందని.. అలా కాదని ఒక కుటుంబం చేతుల్లో పార్టీని నడిపించేందుకు టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నారని.. అలాంటిది జరిగే ప్రసక్తే లేదని ఓపీఎస్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 
 
ఓపీఎస్, ఈపీఎస్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము ఐక్యంగా వున్నామన్నారు. అమ్మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తమలో విబేధాలు సృష్టించేందుకు టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నాడని.. అతడు పలికే మాటలన్నీ అసత్యాలన్నారు. 
 
ఆర్కే నగర్‌‍లో మాయ చేసి గెలిచాడని.. అతడు చేసిన అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఓపీఎస్ వెల్లడించారు. అలాంటి వ్యక్తికి పార్టీ నుంచి సహకరించిన, పార్టీ నియమాలను ఉల్లంఘించిన వెట్రివేల్‌, తంగ త‌మిళ్ సెల్వ‌న్, రంగ స్వామి, ముత్త‌య్య‌, క‌లైరాజ‌న్‌, షోలింగూర్ పార్థిబ‌న్‌ల‌ను పార్టీ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయా నేత‌లు టీటీవీ దినకరన్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఈ విష‌యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఓపీఎస్ తెలిపారు.