ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జులై 2023 (17:40 IST)

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు: ఏడుగురు మృతి

blast
తమిళనాడులోని కృష్ణగిరిలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు వున్నారు. 
 
మరో 20 మంది పరిస్థితి విషమంగా వుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు.
 
అటు శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు.ఘటనా స్థలం వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.