మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (17:57 IST)

దీపావళి పూట తండ్రీ కొడుకులు మృతి..

దీపావళి పూట తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. దీపావళి సంబరాల్లో భాగంగా క్రాకర్స్ కాల్చాలన్న కొడుకు కోరిక తీర్చడం కోసం షాప్‌కు వెళ్లి కొనుగోలు చేసి.. స్కూటీపై ఇంటికి వస్తుండగా మృత్యువు కబళించింది. స్కూటీలో పటాకులు పెట్టుకుని వస్తుండగా పేలుడు సంభవించడంతో తండ్రి, ఏడేళ్ల కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురువారం పుదుచ్చేరి - విల్లుపురం సరిహద్దు ప్రాంతంలో జరిగింది.
 
పుదుచ్చేరిలోని కూనిమేడు గ్రామానికి చెందిన కళైనేసన్‌ అనే వ్యక్తి తన ఏడేళ్ల కొడుకు ప్రదీప్‌ను వెంటబెట్టుకుని గురువారం మధ్యాహ్నం.. సమీపంలోని టౌన్‌కు వెళ్లి క్రాకర్స్‌ కొన్నాడు. వాటన్నింటినీ స్కూటీ డిక్కీలో వేసి కొడుకును తన ముందు నిలబెట్టుకుని మళ్లీ ఊరికి ప్రయాణమయ్యారు. 
 
అయితే కొట్టకుప్పం ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి ఆ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.