బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (10:06 IST)

మదురై ఆస్పత్రిలో ఆగిన విద్యుత్ సరఫరా... ఐదుగురు రోగులు మృతి

తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. 
 
తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో మంగళవారం రాత్రి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాజాజీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 
అదేసమయంలో ఆస్పత్రిలోని జనరేటర్ కూడా పనిచేయక పోవడంతో ఐసీయూ విభాగానికి తక్షణం విద్యుత్ సరఫరా చేయలేక పోయారు. ఫలితంగా ఐసీయూ విభాగంలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగుల్లో ఐదుగురు చనిపోయారు. ఈ విషాదకర ఘటనపై ఆస్పత్రి డీన్ మరోలా స్పందిస్తున్నారు.