శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2020 (15:57 IST)

బొగ్గు స్కామ్ : మాజీ కేంద్ర మంత్రికి మూడేళ్ళ జైలు!

బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కు మూడేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో ముగ్గురిని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. 
 
గత 1999లో జార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్ర‌హ్మ‌దిహ బొగ్గు గ‌నుల‌ను కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చా. ఈ కేసును సుధీర్ఘంగా విచారించిన కోర్టు దిలీప్ రేతో సహా మిగిలిన వారందరినీ దోషులుగా తేల్చింది. వీరికి సోమవారం శిక్షను ఖరారు చేసింది. 
 
దిలీప్‌ రేతో పాటు మరో ఇద్దరు దోషులకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, రూ.10 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. మరోవైపు, క్యాస్ట్రన్‌ టెక్‌కు రూ.60 లక్షలు, క్యాస్ట్రన్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కు మరో రూ.10 లక్షల అదనపు జరిమానా విదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.