శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: బుధవారం, 6 మార్చి 2019 (17:11 IST)

తెలిసిన కండక్టరే కదా అని బస్సెక్కితే ఇంటికి తీస్కెళ్లి చెరిచాడు... స్నేహితులను పిలిచీ...

బస్సులో ప్రయాణించే బాలికతో పరిచయం పెంచుకుని అత్యాచారం చేసాడు ఓ కండక్టర్. అంతేకాకుండా అతని స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. చివరికి గర్భవతి అయిన బాలిక ఇంట్లో చెప్పుకోలేక బయటకు పారిపోయింది. వెతికి పట్టుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌లోని ఓ కాలనీలో నివాసం ఉండే 16 ఏళ్ల బాలిక కాలేజీకి వెళ్లడానికి రోజూ బస్సులో ప్రయాణిస్తుండేది. 
 
ఈ క్రమంలో బాలికకు ఉమేష్ అనే కండక్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఉమేష్ తన పేరు మార్చి అతుల్ అని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒక రోజు కండక్టర్ ఆమెను ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేసాడు. అతని స్నేహితులు ధర్మపాల్, ఆశిష్, అజయ్‌లతో ఈ విషయం చెప్పి, క్రమంగా వారితో కూడా బాలికపై అత్యాచారం చేయించాడు. 
 
ఒకసారి రెండుసార్లు కాదు, 2018 జూలై 1 నుంచి 2019 జనవరి 31వ తేదీ వరకూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. చివరకు బాధితురాలు గర్భవతి అయ్యింది. గర్భం దాల్చినట్లు తెలుసుకున్న ఆ అభాగ్యురాలు ఇంట్లో చెబితే కుటుంబం పరువుపోతుందని, పనికి వెళ్తేగాని పూట గడవని కుటుంబం బజారున పడుతుందని ఆలోచించి ఫిబ్రవరి 28న ఇంటి నుండి పారిపోయింది. 
 
కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆరా తీసిన పోలీసులు బాలిక రాయ్‌పూర్‌లో ఉన్నట్లు కనుగొన్నారు. ఇంటికి తీసుకువచ్చి ఎందుకు పారిపోయావని ప్రశ్నించగా గోడు వెళ్లబోసుకుంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.