ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (10:07 IST)

రమ్‌ బాటిల్‌లో చచ్చిన కప్ప.. మందుబాబులకు షాక్.. ఎక్కడ?

Frog
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఒక్కసారిగా మందుషాపులు తెరవగానే మందుబాబులు ఎగబడ్డారు. క్యూలైన్లలో నిలబడి లిక్కర్ కొన్నారు. అయితే కొందరు మందుబాబులకు మాత్రం రమ్ బాటిల్ ఎందుకురా కొన్నామనిపించింది. మద్యం సీసాలను కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులకు ఒక రమ్‌ బాటిల్లో చచ్చిన కప్ప కనిపించింది.
 
ఈ ఘటన తమిళనాడు శీర్గాళీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెన్‌పాదికి చెందిన కొందరు, శీర్గాళి ఈశాన్య వీధిలో ప్రభుత్వ టాస్మాక్‌ షాపులో శుక్రవారం సాయింత్రం మద్యం కొనుగోలు చేశారు. ఇక బాటిల్స్‌లో పొలంలోకి వెళ్లి బాటిల్ తెరిచి చూడగా షాకయ్యారు. అందులో ఓ కప్ప చనిపోయి కనిపించింది. 
 
మందుతాగుదామనే మూడు పాడై వెంటనే అదికొన్న షాపు యజమాని దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వారు ఈ సమాచారం బయటకు పొక్కకుండా వారిని కవర్ చేసినట్లుగా తెలిసింది.