లాక్‌డౌన్ ఆకలి... తిండి లేక కప్పలు ఆరగిస్తున్న చిన్నారులు
కరోనా వైరస్ కట్టిండికి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. అయితే, ఈ లాక్‌డౌన్ వల్ల ఎక్కువగా కష్టాలుపడుతున్న వారిలో వలస కూలీలతో పాటు.. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా, దారిద్యరేఖకు దిగువున వుండే పేదలు, కూలీ పనులు, ఉపాధి లేక అనేక మంది పస్తులుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవిస్తున్నాయి.
తాజాగా బీహార్ రాష్ట్రంలో కొంతమంది చిన్నారులు ఆకలిని తట్టుకోలేక కప్పలు ఆరగిస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో పేదరికం తారా స్థాయిలో ఉన్న విషయం తెల్సిందే. దీనికితోడు లాక్‌డౌన్ వల్ల పరిస్థితులు ఉపాధి కోల్పోయినవారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ ఒక్క సంఘటనపై దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో కళ్ళకు అద్దంకడుతుంది.