సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (11:10 IST)

ఢిల్లీలో దారుణం.. కదులుతున్న కారులో యువతిపై అత్యాచారం...

ఢిల్లీలో దారుణం జరిగింది. కదులుతున్న కారులో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి పాల్పడింది సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన ఉద్యోగి కావడం గమనార్హం. సరిగ్గా నాలుగేళ్ల

ఢిల్లీలో దారుణం జరిగింది. కదులుతున్న కారులో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి పాల్పడింది సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన ఉద్యోగి కావడం గమనార్హం. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే డిసెంబర్‌లో ఢిల్లీలో నిర్భయ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అత్యాచారానికి పాల్పడ్డవారిపై నిర్భయ చట్టంపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ రేప్ ఘటనలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 
 
ఉపాధి కోసం ఢిల్లీ వచ్చిన యువతికి లిప్ట్ ఇస్తానని చెప్పి ఓ టాక్సీ డ్రైవరు ఎక్కించుకుని అందులోనే అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. ఈ అత్యాచారం గురువారం రాత్రి జరిగింది. ఓ యువతిని ఎయిమ్స్ సమీపంలో నోయిడా వరకు లిప్ట్ ఇస్తానని కారులోకి ఎక్కించుకున్నాడు. ఆపై మోతీబాగ్ వద్ద కారు ఆపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో నిందితుడు కారును వదిలి పారిపోయాడు. పోలీసులు ఆ యువతిని పోలీసుస్టేషనుకు తరలించారు. కారుపై కేంద్ర హోంశాఖ స్టిక్కర్ ఉండటంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.