గోవా సర్కారు సంచలన నిర్ణయం.. 250 టూరిస్ట్ హోటల్స్‌కు అనుమతి

Goa
సెల్వి| Last Updated: బుధవారం, 1 జులై 2020 (18:55 IST)
Goa
గోవాకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. కరోనా వైరస్‌తో లాక్ డౌన్ కారణంగా పర్యాటకం బోసిపోయింది. లాక్ డౌన్ సడలింపులు విధించడం.. గోవాలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా వుండటంతో గోవా సర్కారు ఓ సంచలనం నిర్ణయం తీసుకుంది.

జులై 2 వ తేదీ నుంచి దేశీయంగా పర్యాటకులకు ఆహ్వానం పలికింది. అదే విధంగా గోవాలోని 250 టూరిస్ట్ హోటల్స్‌కు కూడా అనుమతి ఇచ్చింది. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో గోవా టూరిజంపై పర్యాటకులు ఆసక్తి చూపుతారా లేదా అనేది తెలియాల్సి వుంది.

మార్చి 25 వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ విధించడంతో అన్నింటితో పాటు పర్యాటక రంగాన్ని కూడా లాక్ చేసిన సంగతి తెలిసిందే. రైళ్ల రాకపోకలు బంద్ కావడం, విమానాలు తిరగకపోవడంతో పర్యాటకం రంగం కుదేలైంది.దీనిపై మరింత చదవండి :