సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (12:32 IST)

గోద్రా కేసు : మరణశిక్షలు వద్దు... జీవితశిక్షలు చాలు...

గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్‌ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో 11 మంది దోషులకు పడిన ఉరిశిక్షను జీవితఖైదుకు తగ్గిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. గత 2002లో దేశవ్యాప్తంగా సంచలనం

గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్‌ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో 11 మంది దోషులకు పడిన ఉరిశిక్షను జీవితఖైదుకు తగ్గిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. గత 2002లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. 
 
2002 ఫిబ్రవరి 27వ తేదీ సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 కోచ్‌ని గోద్రా జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో తగులబెట్టగా, 59 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనలో మొత్తం 94 మంది నిందితులైన ముస్లింలపై కేసులు నమోదు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం వారిపై చార్జిషీట్‌లను దాఖలు చేసింది. కేసు విచారణ సుదీర్ఘకాలం సాగగా, నిందితుల్లో 63 మందిపై సాక్ష్యాలు లేని కారణంగా ఆరోపణలను కొట్టేసిన సిట్ కోర్టు, మిగిలిన 31 మందిని నేరస్తులుగా నిర్థారించి, వారిలో 11 మందికి మరణశిక్ష, మిగిలినవారికి జీవిత ఖైదును విధించింది. 
 
ఉరిశిక్ష పడిన వారంతా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. దీంతో వారిందరి తరపువాదనలు ఆలకించిన న్యాయస్థానం ఉరిశిక్షలను యావజ్జీవ కారాగారశిక్షలుగా మార్చింది. కాగా.. రైలుదహన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లోగా ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలని సూచించింది.