జయ ఊపిరితో ఉంటే ఆ పత్రాలపై వేలిముద్ర ఎందుకు వేశారు: హైకోర్టు ప్రశ్న
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం మరోమారు వివాదాస్పదం కానుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ నామినేషన్‌కు మద్దతుగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేసిన వేలిముద్రపై వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు బు
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం మరోమారు వివాదాస్పదం కానుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ నామినేషన్‌కు మద్దతుగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేసిన వేలిముద్రపై వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు బుధవారంనాడు ఎన్నికల కమిషన్ అధికారులకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల ఆరో తేదీన కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.
తిరుపరన్‌కుండ్రం ఉప ఎన్నికల్లో ఏకే బోస్ విజయాన్ని సవాలు చేస్తూ వేసిన ఓ పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. జయలలిత జీవించివుంటే ఎన్నికల నామినేషన్ పత్రాలపై సంతకం చేయకుండా వేలిముద్ర ఎందుకు వేశారని హైకోర్టు ప్రశ్నించింది.
2016 నవంబర్‌లో జరిగిన తిరుపరన్‌కుండ్రం ఉపఎన్నికల్లో ఓటమి చవిచూసిన డీఎంకే అభ్యర్థి పి.శరవణన్ ఈ పిటిషన్ దాఖలు వేశారు. ఈసీకి బోస్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో జయలలిత వేలిముద్రకు సంబంధించిన వివరాలను శరవణన్ తన పిటిషన్‌లో కోరారు.