1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (10:32 IST)

జయ చికిత్సపై వీడియో ఆధారాలున్నాయి : దినకరన్

ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అపోలో ఆస్పత్రిలో అందించిన చికిత్సకు సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ ప్రకటించారు. ఈ వీడియోను విచారణ కమిటీకి అందజేస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అపోలో ఆస్పత్రిలో అందించిన చికిత్సకు సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ ప్రకటించారు. ఈ వీడియోను విచారణ కమిటీకి అందజేస్తామని తెలిపారు. 
 
జయలలిత దవాఖానాలో ఉన్నప్పటి వీడియో శశికళ వద్ద ఉందని తెలిపారు. ఆ వీడియో అపోలో దవాఖానా యాజమాన్యం వద్ద కూడా ఉందని చెప్పారు. అందులో జయ నైటీలో ఉన్నందున ఆ వీడియో విడుదల చేయలేదని, అవసరమైతే దర్యాప్తు అధికారికి ఆ వీడియోను అందజేస్తామని ప్రకటించారు. 
 
ఇదిలావుండగా, జయలలిత మరణంపై నిజానిజాలు తేల్చేందుకు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ ఆర్ముగస్వామిని విచారణాధికారిగా తమిళనాడు ప్రభుత్వం నియమించింది. జయలలిత మరణంపై రిటైర్డ్ జడ్జి చేత న్యాయవిచారణ జరిపిస్తామని గత నెల 17న సీఎం పళనిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈమేరకు సోమవారం ఆర్ముగస్వామికి ఏకసభ్య కమిషన్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 22న తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5న మరణించిన విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన వైద్యుడు రిచర్డ్ బీలే నేతృత్వంలోని వైద్య బృందం జయకు చికిత్స అందించింది.