Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకొని బలైయ్యాడు...

Updated: గురువారం, 7 మార్చి 2019 (19:21 IST)
ప్రస్తుతం అందరి చేతిలోనూ మొబైల్ దర్శనమిస్తోంది. ఏ పని చేయాలన్నా దాని అవసరం ఉండనే ఉంటుంది. అలాగే అందులోని కొన్ని యాప్‌లు వినియోగదారులకు బాగా చేరువయ్యాయి. ఇదే కోవకి చెందిన గూగుల్ మ్యాప్స్ కూడా దాని వినియోగదారులకు సరైన మార్గాలను చూపుతూ, గమ్యస్థానాలకు చేరుస్తోంది. 
 
ఒక్కోసారి చక్కర్లు కొట్టిస్తూ విసుగు తెప్పిస్తోంది. కొన్నిసార్లు గమ్యస్థానం పక్కనే ఉంటుంది. అయితే దానిని సరిగ్గా చూపకుండా తికమకపెడుతుంది. సాధారణంగా వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్‌లు ఈ యాప్‌ని బాగా ఉపయోగిస్తుంటారు. వారి బ్రతుకుదెరువు దీనిపైనే ఆధారపడి ఉంటుంది. గూగుల్ మ్యాప్ ఒక వినియోగదారుకి చుక్కలు చూపింది. ఇదే గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని బెంగుళూరులో ఒక క్యాబ్ డ్రైవర్ చిక్కుల్లో పడ్డాడు.
 
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కోనప్పన అగ్రహారలో ఉండే ఓ కస్టమర్ కోసం వెతుకుతూ దీపక్‌ కుమార్ (26) అనే క్యాబ్‌డ్రైవర్ గూగుల్ మ్యాప్ చూపిన దిశలో వెళ్లాడు. ఆ దారి కాస్తా తిన్నగా ఓ కార్ల పార్కింగ్ షెడ్డులోకి తీసుకెళ్లింది. అక్కడి యజమానులు అతడిని అడ్డగించి వాగ్యుద్ధానికి దిగారు. మాటామాటా పెరిగి చేయిచేసుకున్నారు. దీపక్‌ కుమార్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వారిపై ఫిర్యాదు చేసాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేసారు. గూగుల్ మ్యాప్స్ వల్ల తను ఇలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చిందని సదరు క్యాబ్ డ్రైవర్ వాపోయాడు.

అన్నీ చూడండి

Mamitha Baiju: అరుదైన మైలురాయిని అందుకున్న హీరోయిన్ మమితా బైజు

Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

రాజ‌మౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ డేట్ ఫిక్స్

Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత

మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments