శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (11:42 IST)

కోర్కె తీర్చేందుకు నిరాకరించిన హిజ్రా.. కాల్పులు జరిపిన యువకులు

కామంతో కళ్ళుమూసుకున్న ఇద్దరు యువకులు హిజ్రాపై కాల్పులు జరిపారు. కోర్కె తీర్చలేదన్న అక్కసుతో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఢిల్లీలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ త్రిలోక్‌పురి నుంచి బారాపుల్లా రోడ్డుకు వెళ్లేందుకు ఆదివారం తెల్లవారుజామున 12:38 గంటల సమయంలో లిఫ్ట్ కోసం ఎదురుచూస్తోంది. అప్పుడే అటుగా వచ్చిన ఇద్దరు యువకులు తమ కారును ఆపి లిఫ్ట్ ఇస్తామని చెప్పి ట్రాన్స్‌జెండర్‌ను ఎక్కించుకున్నారు. 
 
కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఇద్దరిలో ఓ యువకుడు హిజ్రాను బలవంతం చేశాడు. తమతో శృంగారం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ట్రాన్స్‌జెండర్ అంగీకరించకపోవడంతో ఆమెపై కాల్పులు జరిపి కారులో నుంచి తోసేశారు. 
 
ఈ ఘటనలో గాయపడిన హిజ్రా రోడ్డుపై పడివుండటాన్ని గమనించిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో హుటాహుటిన బాధితురాలిని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు యువకుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు గుర్తించారు. అతని నుంచి రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొకరికోసం పోలీసులు గాలిస్తున్నారు.