కన్హయ్యపై చార్జిషీటును తిరస్కరించిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ ప్రభుత్వం అనుమతి లేకుండా జేఎన్‌యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్‌పై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ చార్జిషీటను ఎలా దాఖలు చేస్తారనంటూ ప్రశ్నించింది. పైగా, దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పోలీసులు.. మరో 10 రోజుల్లోగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటామని తెలిపారు.
కాగా, రాజకీయ దురుద్దేశంతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు కన్నయ్య. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతోనే.. ఇలాంటివి తెరమీదకు తీసుకొస్తున్నారని విమర్శించారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.
2016 ఫిబ్రవరిలో జేఎన్‌యులో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ పోలీసులు.. ఈనెల 14న 12వందల పేజీలతో ఛార్జీషీట్ దాఖలు చేశారు. దీనిలో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఆకూబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీ రసూల్, బషీర్ భట్, బషరత్‌ల పేర్లును కూడా ఛార్జీషీట్‌లో పెట్టారు.