గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: సోమవారం, 3 డిశెంబరు 2018 (15:15 IST)

డ్రైవర్ కిడ్నాప్... వీడియో కాల్‌లో అతడి భార్యను నగ్నంగా...

ఇప్పటివరకూ డ్రైవర్లు దారుణాలకు పాల్పడిన ఘటనలు గురించి విన్నాం. కానీ బెంగళూరులో దీనికి రివర్స్‌గా ఓ దారుణంగా జరిగింది. ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్న నలుగురు దుండగులు, కారు డ్రైవరికి కత్తులు చూపించి బెదిరించి అతడిని చితక్కొట్టారు. ఆ తర్వాత మరీ శృతి మించిపోయారు. 
 
ఈ ఘటన వివరాలను చూస్తే... శుక్రవారం రాత్రి బెంగళూరులో సోమశేఖర్ అనే ఓలా క్యాబ్ డ్రైవర్ అడుగొడి నుంచి దొమ్మసంద్రా వరకూ బుకింగ్ రావడంతో వెళ్లాడు. రాత్రి 10.30 కి ఎక్కిన ఆ నలుగురు కారు గమ్యస్థానానికి చేరుకోగానే దిగాల్సిందిపోయి అతడిని కారును మరికొంత ముందుకు తీసుకెళ్లాలన్నారు. అలా వెళ్లగానే డ్రైవరుకి కత్తులు చూపించి అతడి వద్దనున్న నగదు దోచుకున్నారు. ఆ తర్వాత అతడి సెల్ ఫోన్ లాక్కుని అతడిని చితక బాదారు. 
 
అనంతరం అతడి కారు తాళాలు తీసుకుని సుమారు 100 కి.మీ వరకూ తీసుకెళ్లి అక్కడ ఓ ఏటీఎం నుంచి నగదు డ్రా చేశారు. అంతటితో ఊరుకోకుండా బాధితుడి సెల్ ఫోన్ నుంచి అతడి భార్యకు వీడియో కాల్ చేశారు. ఆమె ఫోన్ ఎటెండ్ చేయగానే... ఆమె భర్తను చూపించి... నీ దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా నిలబడాలనీ, లేదంటే ఇతడిని చంపేస్తామని భయపెట్టారు. 
 
దానితో ఏమి చేయాలో అర్థంకాని ఆ మహిళ వెంటనే దుస్తులను విప్పేసింది. ఆ స్థితిలో ఆమె నగ్న ఫోటోలను తీసుకుని, మళ్లీ డ్రైవరుని చితక్కొట్టారు. ఆ తర్వాత సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అతడిని బాత్రూంలో బంధించారు. ఐతే అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్న బాధితుడు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి వచ్చేసరికి దుండగులు పారిపోయారు.