ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (17:09 IST)

కరోనా భయంతో పనిచేసే ఆఫీసులోనే ఉద్యోగి సూసైడ్

కరోనా వైరస్ భయం కారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి తాను పని చేసే కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహ్రాన్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు కరోనా వైరస్ బారినపడతామనే భయం పట్టుకుంది. దీంతో తాను ప‌నిచేసి కార్యాల‌యంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని జేబులో ఓ సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ దినేశ్ కుమార్ తెలిపారు. 
 
క‌రోనా వైర‌స్ మాన‌సికంగా త‌న‌ను కుంగ‌దీసింద‌ని, అందుకే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నాని ఆ లేఖ‌లో రాసి ఉంద‌ని ఎస్పీ చెప్పారు. మృతుడి కుటుంబ‌స‌భ్యులు కూడా లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి అత‌ను తీవ్ర మాన‌సిక ఒత్తిడిలో ఉన్న‌ట్లు కనిపించాడ‌ని చెబుతున్నారు.