మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (15:34 IST)

కరోనా విధుల్లో మరణిస్తే భారీ పరిహారం : కేజ్రీవాల్ ఉదారం

కరోనా విధుల్లో నిమగ్న విధులు నిర్వహిస్తున్న వారు మరణించే వారి కుటుంబాలకు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారినపడుతున్న వారికి వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు రేయింబవుళ్లు సేవలు అందిస్తున్నారు. 
 
ఇలాంటివారిపై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఉదార స్వభావాన్ని చూపించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. 
 
శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల సేవలను గౌరవించి.. రూ.కోటి పరిహారాన్ని అందజేస్తామన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాగా, ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121కు చేరింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ నుంచి 6 మంది కోలుకున్నారు.