గుట్కా నమిని అసెంబ్లీలో ఊసిన యూపీ ఎమ్మెల్యే (Video)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని కొందరు ఎమ్మెల్యేలు అపరిశుభ్రం చేశారు. గుట్కా నమిలి అసెంబ్లీ ఆవరణలోనే ఊశారు. దీన్ని గమనించిన అసెంబ్లీ స్పీకర్ ఆ పని చేసిన ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గుట్కా ఊసిన ఎమ్మెల్యే స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి చేసిన తప్పుకు క్షమాపణల కోరాలని లేనిపక్షంలో తానే వారిని గుర్తించి అసెంబ్లీ నుంచి బయటకు పంపిస్తానంటూ హెచ్చరించారు.
ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళుతుండగా ప్రవేశద్వారం ఎవరో గోడపై గుట్కా నమిలి ఊశారు. దాన్ని గమనించిన స్పీకర్.. భద్రతా సిబ్బంది వద్ద ఆరా తీయగా, ఓ ఎమ్మెల్యే ఆ పని చేశారంటూ సమాధానమిచ్చారు.
దీంతో ఆగ్రహించిన స్పీకర్.. ఈ పాడుపని చేసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేసిన తప్పును అంగీకరించకపోతే తానే వెల్లడించి, అసెంబ్లీ నుంచి వెళ్లగొడతానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.