ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (11:12 IST)

విమానంలో ఎయిర్‌హోస్టెస్‌‌పై వేధింపులు..

విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. ముంబై- హైదరాబాద్‌ స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన అజయ్‌రెడ్డి అనే

విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. ముంబై- హైదరాబాద్‌ స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన అజయ్‌రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం ముంబై నుంచి హైదరాబాద్‌కు స్పైస్ జెట్ విమానంలో వస్తున్నాడు. 
 
అయితే... విమానంలో ఎయిర్ హోస్టెస్‌‌ను వేధింపులకు గురిచేయగా ఆమె పైలెట్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పైలెట్ సీఐఎస్ఎఫ్‌ సిబ్బందికి వెంటనే సమాచారమిచ్చాడు. దీంతో విమానం దిగిన వెంటనే అజయ్‌రెడ్డిని సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.